‘మీడియం’ కి ప్లాప్ టాక్……. ‘లో’ కి హిట్ టాక్

తెలుగు లో ఈ గురువారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో శర్వానంద్ నటించిన రణరంగం పై మంచి అంచనాలు ఉన్నాయి. దీని బడ్జెట్ కూడా ఎక్కువే. [more]

Update: 2019-08-17 07:08 GMT

తెలుగు లో ఈ గురువారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో శర్వానంద్ నటించిన రణరంగం పై మంచి అంచనాలు ఉన్నాయి. దీని బడ్జెట్ కూడా ఎక్కువే. 16 కోట్ల కు ఈ సినిమాను అమ్మారు. శర్వా గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు హ‌క్కుల్ని రూ.25 కోట్ల‌కు పైనే అమ్మారు. కానీ ఈమూవీ డిజాస్టర్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ రణరంగం పై పడింది. కానీ టాక్ పరంగా ఈమూవీ కి 16 కోట్లు కూడా రావడం కష్టమే అనిపిస్తుంది.

డివైడ్ టాక్ తో తొలి రోజే ఈసినిమా కొంచం పర్లేదు అనిపించుకున్న రెండో రోజు నుండి మాత్రం కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఇక ఈమూవీ తో పాటు అడివి శేష్ ఎవరు సినిమా రిలీజ్ అయింది. ఈమూవీకి మంచి టాక్ వచ్చింది. ఇది బ్రేక్ అవ్వాలంటే 10 కోట్ల పైన కలెక్ట్ చేయాలి. తొలి రోజు స్పీడ్ చూస్తుంటే ఇది పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది. ఈసినిమా కొన్న బ‌య్య‌ర్లు సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News