మహేష్ కోసం నో కాంప్రమైజ్

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్ [more]

Update: 2019-10-01 07:48 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్ వేసి అక్కడే షూట్ చేయనున్నారు. ప్రతి సెట్ కి చాలా ఖర్చు పెట్టారు మేకర్స్. మహేష్ సినిమా కోసం ఎక్కడా కంప్రమైజ్ కావడం లేదు. ఏ సెట్ కి ఎంతెంత అయిందో చూద్దాం.

కోట్లకు కోట్లే….

రామోజీ ఫిలింసిటీలో కర్నూల్ కు చెందిన కొండారెడ్డి బురుజు సెట్ ను వేశారు. ఈ సెట్ కోసం అక్షరాలా నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మహేష్ బాబు అండ్ ప్రకాష్ రాజ్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మరో సెట్ హైదరాబాద్ శివార్లలో వేశారు. ఫామ్ హౌజ్ టైపులో ఉండే ఈ భారీ సెట్ కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెబుతున్నారు. ఈ సెట్ లో విజయశాంతి, మహేష్ కు చెందిన కీలకమైన సన్నివేశాలన్నింటినీ తీయబోతున్నారు అని టాక్.

పాటలు ఇక్కడే….

ఇక మూడో ది ట్రైన్ సెట్ వేశారు. ఈ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారు. దీనికి ఏకంగా 3 కోట్లు రూపాయలు అయ్యాయి. సెట్స్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుందో తెలుసుకోవాలి. ఇక సాంగ్స్ కోసం విదేశాలకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారట. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అన్నపూర్ణ స్టూడియోలోనే సాంగ్స్ కి సంబంధించి సెట్స్ వేసి అక్కడే షూట్ చేయనున్నారు. సంక్రాంతికి ఈమూవీ రిలీజ్ అవుతుంది.

 

Tags:    

Similar News