Sekhar Master Post : నా కూతురి పేరు చెప్పి మోసం చేస్తున్నారు..
నా కూతురు పేరు చెప్పి మోసం చేస్తున్నారు. వారిని నమ్మి మోసపోకండి అంటూ శేఖర్ మాస్టర్ వీడియో రిలీజ్.;
టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు ఐకానిక్ స్టెప్స్ కంపోజ్ చేస్తూ, టెలివిజన్ షోలో కొత్త డాన్సర్స్ ని ప్రోత్సహిస్తూ మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఇక ఆయన వారసులైన కూతురు సాహితి, కొడుకు విన్నీలు టాలీవుడ్ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. 'లవ్ స్టోరీ' సినిమాలో సాయి పల్లవి డాన్స్ చేసిన 'సారంగ దరియా' పాటకి శేఖర్ కూతురు సాహితి వేసిన డాన్స్ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
దీంతో సాహితికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తరువాత నుంచి సోషల్ మీడియాలో సాహితి పోస్టు చేసే డాన్స్ వీడియోస్ బాగా వైరల్ అవుతూ వచ్చాయి. అయితే సాహితికి ఉన్న ఫేమ్ ని కొంతమంది మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్ మాస్టర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. తన కూతురు పేరు మీద ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి పలువురు మోసానికి పాల్పడుతున్నారని, వారిని నమ్మకండి అంటూ చెప్పుకొచ్చాడు.
మీ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తాను సాహితిలా కొందరు మెసేజ్స్ చేస్తున్నారట. అది నమ్మి కొందరు డబ్బుని పంపించి మోసపోతున్నారట. ఇక ఈ విషయాలను కొందరు శేఖర్ మాస్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనికి రెస్పాండ్ అవుతూనే శేఖర్ మాస్టర్ వీడియో షేర్ చేశారు. తన కూతురు అకౌంట్‌ని, ఫేక్ అకౌంట్స్‌ని ఆ వీడియోలో చూపించాడు. తన కూతురు అకౌంట్ లో శేఖర్ మాస్టర్ ఫాలోవర్ గా ఉంటాడని, అది గమనించాలని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.