తొలిసారిగా నాని సరసన స్టార్ హీరోయిన్..!

త్వరలోనే నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ చిత్రం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా [more]

;

Update: 2019-02-21 08:00 GMT

త్వరలోనే నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ చిత్రం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. కాగా ఇందులో నాని సరసన ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఇందులో ఆరుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.

స్పెషల్ సాంగ్ లో…

అలానే ఒక స్పెషల్ సాంగ్ కోసం రకుల్ నానితో స్టెప్స్ వేయనుంది. రకుల్ ప్రీత్ ఇప్పటివరకు నానితో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. తొలిసారి నటిస్తున్న చిత్రం ఇదే. తెలుగులో రకుల్ కు పెద్దగా ఆఫర్స్ ఏమీ లేవు. వెంకీమామ తప్ప. తమిళంలో శివ కార్తికేయన్ 14వ చిత్రంలో నటిస్తుంది. అలానే సూర్యతో ఎన్ జి కె చిత్రంలో నటించింది. మరి తెరపైన రకుల్ – నాని జోడి ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News