బాలీవుడ్ లో హిట్.. మరి ఇక్కడ?
బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా సినిమా హిట్ అవగానే దానికి సీక్వెల్ చెయ్యాలి అనుకోవడం ఈ మధ్యన సర్వసాధారణం అయ్యిపోయింది. [more]
;
బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా సినిమా హిట్ అవగానే దానికి సీక్వెల్ చెయ్యాలి అనుకోవడం ఈ మధ్యన సర్వసాధారణం అయ్యిపోయింది. [more]
బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా సినిమా హిట్ అవగానే దానికి సీక్వెల్ చెయ్యాలి అనుకోవడం ఈ మధ్యన సర్వసాధారణం అయ్యిపోయింది. అందులోనూ రెండు మూడు ప్లాప్స్ పలకరించే సరికి ఇంతకుముందు మనకు హిట్ ఇచ్చిన సినిమా ఫ్లో లో వెళదామనిపిస్తుంది. దాన్నే ఫాలో అవుదామనిపిస్తుంది. హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసే ఫ్రాంచైజీలు బాలీవుడ్ లో అయితే బోలెడున్నాయి. తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే ఆ సీక్వెల్స్ ఊపందుకుంటున్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సీక్వెల్స్ ని పరిశీలిస్తే.. వెంకటేష్ దృశ్యం 2, నిన్న ఓపెనింగ్ జరుపుకున్న నాని – అడివి శేష్ హిట్ 2, అలాగే మంచు విష్ణు – శ్రీని వైట్ల ఢీ 2, అడివి శేష్ గూఢచారి 2 , అలాగే పూరి జగన్నాధ్ తమ్ముడి సాయి రామ్ శంకర్ ల బంపరాఫర్ 2 కూడా మొదలయ్యింది.
టాలీవుడ్ లో మొదలైన ఈ సీక్వెల్స్ ని పక్కనబెడితే.. పూరి జగన్నాధ్ – మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ 2 టేకాఫ్ కాబోతుంది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక తారక్ – వినాయక్ కాంబినేషన్ లో అదుర్స్ 2 అనేది ఎప్పటినుండో నలుగుతుంది. ఇక తమిళ్ లోను కార్తీ ఖైదీ 2 రావాల్సి ఉంది. ఇలా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటూ అటు హీరోలు, ఇటు దర్శకులు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు కన్నడలో రాబోతున్న పాన్ ఇండియా ఫిలిం సీక్వెల్ కెజిఎఫ్ 2 మీదే ఉంది. అది గనక సక్సెస్ అయితే మరిన్ని సీక్వెల్స్ పట్టాలెక్కడం ఖాయం.