తనని తానే పెళ్లిచేసుకున్న"ఈతరం ఇల్లాలు" నటి
పాపులర్ సీరియల్ అయిన దియా ఔర్ బాతి హమ్ తెలుగుల ఈతరం ఇల్లాలు గా డబ్ అయి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.;
ఆడ - మగ కలసి ఉండటం సృష్టి. ఆధునిక పోకడలకు పోతున్న మనిషి ఈ మధ్య పురుషుడిని పురుషుడు, స్త్రీ ని మరో స్త్రీ ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి లెస్బియన్ పెళ్లిళ్లు సర్వసాధారణమవుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు మరో రకం పెళ్లిళ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మగాళ్లపై నమ్మకం లేదంటూ తమని తామే పెళ్లాడుతున్నారు కొందరు. ఇటీవలే ఓ యువతి ఇలాంటి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో పాపులర్ సినీ నటి కూడా తనని తాను పెళ్లిచేసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది.
హిందీలో పాపులర్ సీరియల్ అయిన దియా ఔర్ బాతి హమ్ తెలుగుల ఈతరం ఇల్లాలు గా డబ్ అయి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఈ సీరియల్ లో కవిత పాత్రలో నటించిన గుజరాత్ నటి కనిష్కా సోని కొన్ని సినిమాల్లోనూ నటించింది. కనిష్కా సోని తాజాగా తనని తానే పెళ్లాడినట్లు ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ఇటీవల కనిష్కా నుదుటిన సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
పెళ్లి ఎప్పుడు చేసుకున్నావని అభిమానులు ఆరా తీయగా.. అసలు విషయం చెప్పింది. తనని తానే పెళ్లి చేసుకున్నట్లు కనిష్కా చెప్పగా.. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయని, ఓ మహిళ శృంగారానికి పురుషుడితో ఇక పని లేదన్నారు ఆమె. మాట మీద నిలబడే మగాడ్ని తన జీవితంలో చూడలేదని, అందుకే పురుషుడు లేకుండానే జీవితం గడపాలన్న నిర్ణయానికొచ్చానని పేర్కొన్నారు.