షాహిద్ కపూర్ కొన్న ఇల్లు ఎంతో తెలుసా?

బాలీవుడ్ హీరోల కి రెమ్యూనరేషన్ కి తగ్గట్టుగానే వారి రిచ్ నెస్ కూడా ఉంటుంది. అంత కాస్టలీ గా బతికే బాలీవుడ్ స్టార్స్ తమ ఇల్లు విషయంలో [more]

Update: 2019-08-30 12:05 GMT

బాలీవుడ్ హీరోల కి రెమ్యూనరేషన్ కి తగ్గట్టుగానే వారి రిచ్ నెస్ కూడా ఉంటుంది. అంత కాస్టలీ గా బతికే బాలీవుడ్ స్టార్స్ తమ ఇల్లు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎన్ని కోట్లు అయినా మంచి ఇంట్లో ఉండాలనే వాళ్ళ కల నిజం చేసుకుంటున్నారు. రీసెంట్ గా షాహిద్ కపూర్ ఏకంగా రూ.56 కోట్లు పెట్టి డూప్లెక్స్ కొనుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది.

సీ ఫేసింగ్ ఉండటంతో…..

ముంబై సిటీ లో రిచెస్ట్ సెలబ్రిటీ జనం నివసించే వర్లీలో షాహిద్ కపూర్ ఓ ఫ్లాట్ కొన్నాడు. ఆకాశహార్మ్యంలో ఉండే ఈ భవంతి 42-43 అంతస్తులో 8626 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. ఈ ఏరియా లో సీ-ఫేసింగ్ ఉండే భవంతులే ఎక్కువగా ఉంటాయి. సముద్రపు అలలు కనిపించే విధంగా షాహిద్ కపూర్ డూప్లెక్స్ ని కొన్నాడు. ప్రస్తుతం ఈ భవంతి నిర్మాణంలో ఉందని తెలుస్తోంది. ఇక్కడ షాహిద్ ఒక్కడే కాదు. అక్షయ్ కుమార్ – అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లు ఇదే భవంతిలో ఇప్పటికే అడ్వాన్సులిచ్చి మరీ బుక్ చేసుకున్నారు. ఇక వీటిని రిట్స్ కర్ల్ టన్ అనే ప్రఖ్యాత రియల్టర్ కంపెనీ నిర్మిస్తోంది.

Tags:    

Similar News