ఆశించిన కలెక్షన్స్ అందుకోలేకపోయిన గాంఢీవధారి అర్జున
హాలీవుడ్ లెవల్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా గ్లోబర్ వార్మింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ
వరుణ్ తేజ్, సాక్షి వైద్య నటించిన 'గాంఢీవధారి అర్జున' విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకులు కనీసం పట్టించుకోవడం లేదు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే చెత్త ఓపెనింగ్‌ను నమోదు చేసింది. ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఆశ్చర్యకరంగా అతని కెరీర్‌లో ఘోరమైన ఓపెనింగ్‌ను సాధించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అన్ని ప్రాంతాలలో తక్కువ కలెక్షన్స్ ను అందుకుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ రోజు షేర్ 1Cr కంటే తక్కువ నమోదైంది. దీన్నిబట్టి సినిమాకు ఎలాంటి డిజాస్టర్స్ ఓపెనింగ్ వచ్చాయో అర్థమవుతుంది.
హాలీవుడ్ లెవల్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా గ్లోబర్ వార్మింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మహా భారతం వంటి దేశాన్ని కాపాడే క్రమంలో గాండీవం చేపట్టిన అర్జునుడి పాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 600 వరకు థియేటర్స్‌లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఫస్ట్ షో నుంచే బ్యాడ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే అతని కెరీర్‌లో ఓ చెత్త సినిమాగా నిలిచిపోనుంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 75 లక్షలకు అటూ ఇటూగా షేర్ రాగా.. రెండో 45 లక్షల రేంజ్‌లో గ్రాస్, 23 లక్షల రేంజ్‌లో షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా 28 లక్షల రేంజ్‌లో షేర్ వచ్చిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్‌ను చూస్తే నైజాం - 80 లక్షలు, సీడెడ్ - 22లక్షలు, ఆంధ్రా - 83 లక్షలు, ఏపీ తెలంగాణలో మొత్తంగా 1.85 కోట్ల గ్రాస్ రాగా.. 98 లక్షల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2.50 కోట్ల గ్రాస్ రాగా.. 1.28 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా వాల్యూ బిజినెస్ 17 కోట్ల దాకా ఉండగా.. 18 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది.