శృతి హాసన్ డబుల్ గేమ్ ఆడుతుందా?

చాలా రోజుల తర్వాత శృతి హాసన్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుంది.  ప్రేమ వ్యవహారాలతోను, వరస ప్లాప్స్ తోనూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శృతి హాసన్ కి [more]

Update: 2020-04-16 08:12 GMT

చాలా రోజుల తర్వాత శృతి హాసన్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుంది. ప్రేమ వ్యవహారాలతోను, వరస ప్లాప్స్ తోనూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శృతి హాసన్ కి నిర్మాతలు గ్యాప్ ఇచ్చేలా కనబడినప్పటికీ.. తెలుగులో రవితేజ సినిమాలో ఓ ఆఫర్ పట్టేసింది శృతి హాసన్. అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లోను ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి శృతి హాసన్ ఎంపికైనట్లుగా వార్తలు రావడం, దాన్ని శృతి హాసన్ ఖండించడం జరిగింది. ఇప్పటికే రెండు సినిమాల్లో పవన్ కళ్యాణ్ జోడిగా నటించిన శృతి హాసన్ మూడోసారి పవన్ సరసన అనేసరికి పవన్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ శృతి హాసన్ ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది.

అయితే తాజాగా శృతి హాసన్ డబుల్ గేమ్ ఆడుతుంది అని.. శృతి హాసన్ ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాలో గెస్ట్ రోల్ చెయ్యడానికి సంతకాలు కూడా చేసింది అని…. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయని.. కానీ శృతి హాసన్ అలా నేను వకీల్ సాబ్ లో నటించడం లేదని ఎందుకు చెప్పిందో మాకు అర్ధం కావడం లేదని వకీల్ సాబ్ మూవీ యునిట్ చెబుతుంది. అయితే అగ్రిమెంట్ కూడా అయ్యాక శృతి హాసన్ ఇలా మాట్లాడింది అంటే… శృతి ఈ సినిమా నుండి అగ్రమెంట్ అయ్యాక తప్పుకుందా? లేదంటే మూవీ యూనిట్ చెప్పేవరకు తాను రివీల్ చెయ్యడం ఎందుకులే అని అనుకుందో అనేది మాత్రం పవన్ ఫాన్స్ కి అర్ధం కాక తల పట్టుకుంటున్నారు.

Tags:    

Similar News