క్రేజ్ లేకపోయినా కోట్లు కావాలట

తెలుగులో రేసు గుఱ్ఱం, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించి.. కాటమరాయుడు లాంటి సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న శృతి హాసన్ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో [more]

Update: 2019-06-11 03:51 GMT

తెలుగులో రేసు గుఱ్ఱం, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించి.. కాటమరాయుడు లాంటి సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న శృతి హాసన్ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించింది కానీ అమ్మడు కి లక్కు మాత్రం కలిసి రాలేదు. మధ్యలో బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి గిల్లీ అంటూ కెరీర్ ని పక్కన పడేసిన శృతి హాసన్ తాజాగా బాయ్ ఫ్రెండ్ కి టాటా చెప్పేసి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా కిక్కెక్కించే ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసున్న శృతి హాసన్ కి తెలుగు నుండి ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పటికే కొరటాల శివ చిరు కోసమా శృతి హాసన్ ని అప్రోచ్ అయ్యాడనే న్యూస్ ప్రచారం లో ఉంది.

అలాగే రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం కూడా శృతి హాసన్ ని సంప్రదించారట. మరి రవితేజ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ అంటున్నారు. ఇప్పటికే శృతి హాసన్ తో బలుపు సినిమాలో రవితేజ నటించి హిట్ కొట్టాడు. మరోసారి ఈజంట వెండితెర మీద సందడి చేయబోతోందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసమా శృతి హాసన్ భారీగా పారితోషకం అంటే.. క్రేజ్ ఉన్నప్పుడు ఎంత పారితోషకం అందుకుందో ఇప్పుడు కూడా శృతి హాసన్ అంతే డిమాండ్ చేస్తుందట. ఈ సినిమాలో నటించాలంటే పారితోషికంగా ఆమె 1.5 కోట్లు డిమాండ్ చేస్తోందట. నిర్మాతలు అంత అయితే కష్టమన్నప్పటికీ మెట్టు దిగడం లేదని చెప్పుకుంటున్నారు. మరి క్రేజ్ ఉన్నప్పుడు అయితే ఓకె… క్రేజ్ లేనప్పుడు కోట్లు కావాలంటే ఎలా శృతి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు

Tags:    

Similar News