సింపుల్ పెళ్లా..?

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్ళెప్పుడు చేసుకుంటుందా? అని కోలీవుడ్ మీడియానే కాదు.. టాలీవుడ్ మీడియా కూడా ఎదురు చూస్తుంది. మీడియానే కాదు.. నయన్ అభిమానులు [more]

Update: 2020-06-04 11:01 GMT

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్ళెప్పుడు చేసుకుంటుందా? అని కోలీవుడ్ మీడియానే కాదు.. టాలీవుడ్ మీడియా కూడా ఎదురు చూస్తుంది. మీడియానే కాదు.. నయన్ అభిమానులు కూడా నయనతార పెళ్లిపై పిచ్చ ఆసక్తిగా ఉన్నారు. మరి గతంలో శింబుతోను, ప్రభుదేవతోను నయన్ పెళ్లి పీటల దాక వచ్చి ఆగడంతో.. ఇప్పుడు విగ్నేష్ – నయన్ ల పెళ్లిపై అందరిలోనూ క్యూరియాసిటీనే. కొన్నేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్న నయనతార – విగ్నేష్ లు విగ్నేష్ తల్లితండ్రుల కోరిక మేరకు పెళ్ళికి సిద్దమైనట్లుగా న్యూస్ ఉంది.

అయితే నయనతార – విగ్నేష్ శివన్ లు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. కాకపోతే ఈ పెళ్లి చాలా సింపుల్ గా ఉండబోతుంది అని, అటు నయనతార ఇటు విగ్నేష్ శివన్ లు ‘లో’ ప్రొఫైల్.. మెయింటింగ్ చేసే వ్యక్తులు కాబట్టి ప్లేపెళ్లిని కూడా చాలా సింపుల్ గా ఓ టెంపుల్ లో చేసుకోబోతున్నారని, ఇప్పటికే ముహుర్తాలు కూడా పెట్టారని.. అయితే కరోనా కాలం కలిసొచ్చి పెళ్లి చాలా సింపుల్ గా చర్చ్ లో చేసుకుని.. తర్వాత మెల్లిగా మీడియాకి కబురు అందిస్తారని అంటున్నారు. సో అంత పెద్ద లేడి సూపర్ స్టార్ పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతుందన్నమాట. 

Tags:    

Similar News