Simran Natekar : ఇండియాలో ఏ హీరో సినిమాకి వెళ్లినా.. ముందుగా అందరికి కనిపించే సన్నివేశం స్మోకింగ్ యాడ్. ఈ స్మోకింగ్ యాడ్ కి సంబంధించి రెండు మూడు యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. కాగా ఈ యాడ్స్ లో ఒక ఫాదర్ అండ్ డాటర్ వెర్షన్ ఉంటుంది. అది అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. స్మోకింగ్ చేసే తండ్రి మాత్రమే కాదు, దాని వల్ల చుట్టూ ఉన్న తన ఫ్యామిలీ కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెబుతూ.. ఆ యాడ్ ని చిత్రీకరించారు.
ఇక ఈ యాడ్ లోనే ఒక చిన్న పిల్ల కూడా కనిపిస్తుంది. ఆ చిన్న పాప ఇప్పుడు ఎంత అందంగా మారిందో చూశారా..? ప్రస్తుతం ఆమె కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ చిన్న పాప పేరు ఏంటంటే.. 'సిమ్రాన్ నాటేకర్'. ఈమె ముంబైకి చెందిన భామ. ప్రస్తుతం నటిగా బాలీవుడ్ లో కొనసాగుతుంది. వెబ్ సిరీస్ అండ్ మూవీస్ లో నటిస్తూ తన ఫేమ్ ను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అందమైన ఫోటోషూట్స్ తో మంచి ఫాలోవర్లు ని సంపాదించుకున్నారు. మరి ఆ ఫోటోషూట్స్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.