హంపి వేడుకల్లో.. సింగర్ కైలాష్ ఖేర్ కు చేదు అనుభవం

హంపీ ఉత్సవాలు లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పాటలు పాడుతున్న..;

Update: 2023-01-30 08:28 GMT

bollywood news, hampi utsav, attack on kailash kher

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ కు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న హంపీ ఉత్సవాలు లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పాటలు పాడుతున్న కైలాష్ ఖేర్ పై ఇద్దరు యువకులు వాటర్ బాటిల్ తో దాడిచేశారు. కైలాష్ పాటలు పాడుతుండగా స్టేజిపైకి బాటిల్ ను విసిరేశారు. అది అదృష్టవశాత్తు పక్కన పడింది. అదేమీ పట్టించుకోకుండా కైలాష్ పాటను కంటిన్యూ చేశారు. కాసేపటికి సిబ్బంది ఆ బాటిల్ ను తొలగించారు.

కాగా.. కైలాష్ పై దాడికి పాల్పడిన యువకుల్ని గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కేవలం హిందీ పాటలే పాడుతున్నారని, కన్నడ పాటలు పాడటంలేదన్న కోపంతోనే బాటిల్ విసిరేసినట్లు యువకులు చెప్పారని పోలీసులు తెలిపారు. కాగా.. ఇటీవల సింగర్ మంగ్లీ కారుపై కూడా ఇదే కారణంతో రాళ్లదాడి చేశారు. జనవరి 27 నుండి 29 వరకూ జరిగిన హంపి వేడుకల్లో.. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.


Tags:    

Similar News