ఇన్ స్టాగ్రామ్ కోసం సామ్ ప్రేత్యేకమైన టీం

సోషల్ మీడియా వచ్చాక సెలెబ్రెటీస్ హడావిడి ఎక్కువై పోయింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ అకౌంట్స్ తో తరచూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నారు సెలెబ్రెటీస్. ఇక హీరోయిన్స్ గురించి [more]

;

Update: 2019-10-15 06:25 GMT

సోషల్ మీడియా వచ్చాక సెలెబ్రెటీస్ హడావిడి ఎక్కువై పోయింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ అకౌంట్స్ తో తరచూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నారు సెలెబ్రెటీస్. ఇక హీరోయిన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళు లెగిసిన దగ్గర నుంచి పడకునే వరకు అన్ని తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టి ఫ్యాన్స్ కి మరింత దగ్గర అవుతున్నారు.అలానే సమంత కూడా తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఏవో ఒక ఫొటోస్ తీసి అవి ఇన్ స్టా గ్రామ్ లో పెట్టి ఫ్యాన్స్ ని దిల్ కుష్ చేస్తుంది. అయితే సామ్ పెట్టె ఏ పోస్ట్ అయినా, ఏ ఫోటో అయినా ప్రొఫెషనల్‌గా వుండేలా ఒక టీమ్‌నే అపాయింట్ మెంట్ చేసుకుంది.

కుక్క కోసమేనా…?

ఈ టీం లో ఒక ఫోటో గ్రాఫర్, ఒక పర్సనల్‌ డిజైనర్‌, మేకప్‌ మ్యాన్ ఉన్నారు. వీరి కోసం ఆమె భారీగా చెల్లిస్తుంది. ఎంత చెల్లించినా క్వాలిటీ ఉన్న ఫొటోస్ వస్తాయి కాబట్టి వారి కోసం భారీగా ఖర్చు పెడుతుంది. బహుశా చాలా మంది సెలెబ్రెటీస్ ఇలానే ఒక టీం ని అపాయింట్ మెంట్ చేసుకుంటారేమో ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేసే సామ్ ఈ పర్సనల్‌ టీమ్‌ దేనికో అనే కామెంట్లు కూడా పడుతున్నాయి. ఈ మధ్య సామ్ తన కుక్క కు సంబంధించి ఫొటోస్ తెగ పెట్టేసింది. బహుశా ఆ టీం ని సామ్ ఆ కుక్క ని ఫొటోస్ తీయడానికి అపాయింట్ మెంట్ చేసుకుందేమో అని కామెంట్స్ కూడా వస్తున్నాయి

 

Tags:    

Similar News