మురళీధరన్ బయోపిక్ ట్రైలర్ చూశారా.. మూవీ టైటిల్‌గా '800' ఎందుకు..?
లెజెండరీ ఆఫ్ స్పిన్నర్, శ్రీలంక క్రికెటర్ 'ముత్తయ్య మురళీధరన్' బయోపిక్ '800' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అసలు ఆ మూవీకి ఆ టైటిల్ ని ఎందుకు పెట్టారో తెలుసా..?
సినీ, క్రీడా, బిజినెస్.. ఇలా పలు రంగాల నుంచి ఇప్పటికే అనేక బయోపిక్‌లు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో మరో బయోపిక్ సిద్ధమైంది. ప్రముఖ శ్రీలంక క్రికెటర్ 'ముత్తయ్య మురళీధరన్' (Muttiah Muralitharan) జీవిత కథ ఆధారంగా '800' అనే టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు, విమర్శలు ఎదురవుతూ వచ్చాయి.
లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ మురళీధరన్ పాత్రని పోషించడానికి ముందుగా తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఎంపిక అయ్యాడు. అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం పై పూర్తి వ్యతిరేకత రావడంతో.. స్వయంగా మురళీధరన్ తనని ఈ సినిమా నుంచి తప్పుకోవాలంటూ విజయ్ కి సూచించాడు. 'తన బయోపిక్ వల్ల ఒక గొప్ప నటుడు కెరీర్ చిక్కుల్లో పడకూడదని' విజయ్ సేతుపతిని రిక్వెస్ట్ చేస్తూ అప్పటిలో మురళీధరన్ ఒక ట్వీట్ చేశాడు.
ఆ తరువాత ఈ మూవీలో మురళీధరన్ పాత్ర పోషించడానికి.. స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీలో నటించిన 'మధుర్ మిట్టల్' ఎంట్రీ ఇచ్చాడు. మురళీధరన్ వైఫ్ 'మదిమలర్' రోల్ లో 'మహిమా నంబియార్' కనిపించబోతుంది. ఎంఎస్ శ్రీపతి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి '800' అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే.. టెస్టు క్రికెట్ లో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. అందుకనే మూవీకి ఆ టైటిల్ ని పెట్టారు.
తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్స్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ కి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా వచ్చి ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. కాగా స్పోర్ట్స్ బయోపిక్ అంటే.. ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం 'ధోని'. ఆ తరువాత సచిన్, కపిల్ దేవ్, మరికొన్ని బయోపిక్ లు వచ్చినా ఆడియన్స్ ని ధోని రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాయి. మరి ఇప్పుడు మురళీధరన్ బయోపిక్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.