కమెడియన్ డైరెక్టర్ గా మారాడు..!
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మంచి కామెడీ టైమింగ్ కనబరుస్తాడని అందరికీ తెలిసిందే. అతని కామెడీ టైమింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం కమెడియన్ గా మంచి [more]
;
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మంచి కామెడీ టైమింగ్ కనబరుస్తాడని అందరికీ తెలిసిందే. అతని కామెడీ టైమింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం కమెడియన్ గా మంచి [more]
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మంచి కామెడీ టైమింగ్ కనబరుస్తాడని అందరికీ తెలిసిందే. అతని కామెడీ టైమింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం కమెడియన్ గా మంచి సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ రెడ్ట్ మెగా ఫోన్ పట్టాడు. ఇతను డైరెక్టర్ గా ఓ సినిమా కూడా తీసాడు. దాని పేరే భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఫ్లయింగ్ కలర్స్ అనే పేరుతో రెగ్యులర్ గా ప్రస్తుతం ఉన్న హాస్యనటులంతా కలిసి గెట్-టు-గెదర్స్ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
కమెడియన్లనే నిర్మాతలుగా
అయితే వీరంతా కలిసి నిర్మాతలుగా మారి అదే పేరుతో(ఫ్లయింగ్ కలర్స్) ఈ సినిమాను నిర్మించారు. దీన్ని డైరెక్ట్ చేసే బాధ్యత శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. దాంతో తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఈ మూవీలో బ్రహ్మానందం నుంచి షకలక శంకర్ వరకు దాదాపు హాస్యనటులంతా ఉన్నారు. ఇది పక్కా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని టాక్. అయితే శ్రీనివాస్ రెడ్డి దీన్ని ఎప్పుడు తీసాడో తెలియకుండానే కంప్లీట్ చేసాడు. త్వరలోనే టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.