స్టార్ మా కి టీఆర్పీ కష్టాలు!

ఐపీఎల్ అయ్యిపోయింది.. బిగ్ బాస్ కి క్రేజ్ వచ్చేస్తుంది అనుకున్న స్టార్ మా కి బిగ్ బాస్ అడుగడుగునా పరీక్ష పెడుతూనే ఉంది. ఏదో చేద్దామనుకున్న బిగ్ [more]

;

Update: 2020-11-30 07:14 GMT
Big Boss 4
  • whatsapp icon

ఐపీఎల్ అయ్యిపోయింది.. బిగ్ బాస్ కి క్రేజ్ వచ్చేస్తుంది అనుకున్న స్టార్ మా కి బిగ్ బాస్ అడుగడుగునా పరీక్ష పెడుతూనే ఉంది. ఏదో చేద్దామనుకున్న బిగ్ బాస్ లో ఏమి జరక్కపోగా..   బిగ్ బాస్ సీజన్ 4 ఆఖరి దశకు చేరుకుంది. శనివారం రాత్రి బిగ్ బాస్ హౌస్ సభ్యులతో నాగార్జున చెడుగుడు ఆడుకున్నాడు. అభిజిత్ ఇంకా హరికలకు నాగ్ ఇచ్చిన క్లాస్ తో.. వారిద్దరూ వణికిపోయారు. హారిక బెస్ట్ కెప్టెన్ కాదని, ఆమె చేసిన తప్పులు ఏమిటో ఆమెతోనే చెప్పించిన నాగార్జున అభిజిత్ కి ఏకంగా తలంటేసాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న మోనాల్ ఫస్ట్ సేవ్ అవ్వగా.. అవినాష్ కి బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ కార్డు వాడతావా.. ఉంచుకుంటావా అని అడిగిన నాగ్ సన్ డే ఎపిసోడ్ కి రాకుండా.. కిచ్చ సుదీప్ ని స్టేజ్ మీదకి పంపి ఇంటి సభ్యులకి ఝలక్ ఇచ్చాడు.

స్టార్ మా టీఆర్పీ కోసం నాగార్జున వారానికో గెస్ట్ అన్నట్టుగా ఈ వారం సుదీప్ ని తెచ్చాడు. ఆదివారం ఎపిసోడ్ కి కిచ్చ సుదీప్ గెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాగా.. బిగ్ బాస్ సభ్యులంతా నాగ్ సర్ ఏరి అని సుదీప్ ని అడిగితే.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఆయన విసిగిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారనగానే హౌస్ మేట్స్ అంతా కేకలుపెట్టేసారు. నాగ్ సర్ అలా చెయ్యరు.. ఆయనకి మేమంటే ఇష్టం అంటూ అరిచేసారు. హి ఈజ్ ద కింగ్, నాగ్ సర్ ఈజ్ ద బెస్ట్ అని అభిజిత్ అనగానే నేను కూడా అగ్రీ అంటూ నాగార్జునని సుదీప్ స్టేజ్ మీదకి ఆహ్వానించాడు.ఇక సుదీప్ హౌస్ మేట్స్ సరదాగా ఆదుకున్న  తర్వాత ఈ వారం అరియనా – అవినాష్ లలో ఎలిమినేషన్స్ లో పెద్దగా మజా లేకుండానే అవినాష్ ఏవిక్షన్ కార్డు వాడి ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. ఇక తర్వాత అవినాష్ చాలానే ఫీలయ్యాడు. మరి వారానికో గెస్ట్ వచ్చినా బిగ్ బాస్ షో లో మజా లేకపోవడంతో స్టార్ మా కి టీఆర్పీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News