పుష్ప కోసం సుకుమార్ పాట్లు!!

సుకుమార్ రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి రెండున్నరేళ్లు పట్టినా… ఇప్పుడు కూడా సుకుమార్ సినిమాకి అన్ని అడ్డంకులే. బన్నీ తో ఎలాగో [more]

;

Update: 2020-06-12 11:27 GMT
పుష్ప
  • whatsapp icon

సుకుమార్ రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి రెండున్నరేళ్లు పట్టినా… ఇప్పుడు కూడా సుకుమార్ సినిమాకి అన్ని అడ్డంకులే. బన్నీ తో ఎలాగో పుష్ప ని పాన్ ఇండియా లెవల్ సినిమా మొదలెట్టాడంటే కరోనా అడ్డం పడింది. ఇప్పట్లో పుష్పని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడానికి కష్టం. ఇప్పుడు ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కి అనుమతులిచ్చినా.. పాన్ ఇండియా లెవల్ సినిమాలన్నీ ఇక్కడే సెట్స్ వేసుకుని పని కానిచ్చాల్సిన పరిస్థితి. ఇప్పటికే RRR కోసం రాజమౌళి హైదెరాబాద్ లోనే 20 కోట్ల సెట్ వేస్తున్నాడని టాక్ ఉంది. ఇక సుకుమర్ కూడా ఇప్పుడప్పుడే ఫారెస్ట్ కి వెళ్లి షూటింగ్ చెయ్యడం జరిగే పని కాదు. అందుకే ఫారెస్ట్ సెట్ వేసే ప్లాన్ లో ఉన్నాడట.

అంతేకాకుండా ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్ పక్కనబెట్టి.. ఇండోర్ లో చేసే షూట్ మీద సుకుమార్ ఫోకస్ పెట్టాడట. అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక ల మీద సాంగ్స్ కూడా సెట్స్ వేసి హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తారట. ముందు కొన్ని నెలల పాటు ఇండోర్ లోనే అంటే హైదెరాబాద్లోనే  షూటింగ్ చేసాక తర్వాతే అవుట్ డోర్ షూటింగ్ ని మొదలెట్టే ప్లాన్ లో సుకుమార్ ఉన్నాడట. ఈ విషయంలో లెక్కల మాస్టర్ పర్ఫెక్ట్ గా లెక్కలు వేసుకుంటున్నాడట. ఏ సీన్ ఎప్పుడు చెయ్యాలి, ఏ సీన్ హోల్డ్ లో పెట్టాలి అనే లెక్కలు వేసుకుంటున్నాడట. ఇక బన్నీ, రశ్మికలిద్దరూ ఈ నెల గ్యాప్ తీసుకుని జులై లో పుష్ప షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. సినిమా లేట్ అయినా పర్లేదు.. అన్ని జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ మొదలెడదామని చెప్పాడట బన్నీ.

Tags:    

Similar News