మొత్తం నిర్మాతదే తప్పు..!
“మళ్ళి రావా” సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న సుమంత్ కి ఈ ఏడాది వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. “సుబ్రమణ్యపురం”తో మొదటి డిజాస్టర్ అందుకుంటే [more]
;
“మళ్ళి రావా” సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న సుమంత్ కి ఈ ఏడాది వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. “సుబ్రమణ్యపురం”తో మొదటి డిజాస్టర్ అందుకుంటే [more]
“మళ్ళి రావా” సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న సుమంత్ కి ఈ ఏడాది వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. “సుబ్రమణ్యపురం”తో మొదటి డిజాస్టర్ అందుకుంటే “ఇదం జగత్”తో రెండో డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే “సుబ్రమణ్యపురం” సినిమాకి కొంచెం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ “ఇదం జగత్” అనే సినిమా జనాలకి అసలు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదు అంటే దీని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్స్ దీన్ని హడావుడిగా.. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయడంతో ఘోరమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా సుమంత్ కి డిసాస్టర్ ని తెచ్చిపెట్టింది.
ప్రొడ్యూసర్ పై సుమంత్ ఫైర్
టాక్ ఎలా ఉందని పక్కన పెడితే అసలు ఈ సినిమా తన కెరీర్ లో చాలా తక్కువ కలెక్షన్స్ వసూలు చేసిందని చెబుతున్నాడు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పాడు సుమంత్. ‘‘అసలు ఇంత దారుణంగా సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు..? కనీసం ప్రమోషన్స్ లేకుండా సినిమాను ఎందుకు వదిలారో నాకు అర్ధం కావట్లేదు. సినిమా తీయడం ఇష్టం లేకపోతే సైలెంట్ గా కూర్చోవాలి కానీ డబ్బులు పోసి సినిమాని తీసి పబ్లిసిటీ చేయకుండా ఎలా రిలీజ్ చేస్తారు’’ అని ప్రొడ్యూసర్ కి ఏకిపారేసాడు. ఈ విషయాలు అన్నీ ఓ లేఖ రూపంలో రాసి ప్రొడ్యూసర్ కి పంపాడట సుమంత్.