సూపర్ డీలక్స్ కు అద్భుతమైన రేటింగ్స్..!

కోలీవుడ్ లో నిన్న భారీ కాస్టింగ్ తో ఓ సినిమా రిలీజ్ అయింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, మిస్కిన్ ముఖ్య పాత్రల్లో [more]

;

Update: 2019-03-30 12:09 GMT

కోలీవుడ్ లో నిన్న భారీ కాస్టింగ్ తో ఓ సినిమా రిలీజ్ అయింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటించిన సూపర్ డీలక్స్ అనే చిత్రం నిన్న తమిళనాట మొత్తం రిలీజ్ అయింది. త్యాగరాజన్ కుమార రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించాడు. ఆలాగే ఫహద్ ఫాజిల్ భార్యగా సమంత నటన ఈ చిత్రానికి హైలైట్స్ అని టాక్.

మళ్లీ సమంతకు హిట్

రిలీజ్ అయిన అన్ని చోట్ల అద్భుతమైన రేటింగ్స్ తో మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ క్రిటిక్స్ 4 రేటింగ్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుందని సమాచారం. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాతో మరోసారి సామ్ కు సూపర్ హిట్ దక్కింది

Tags:    

Similar News