లలిత్ మోదీ చేసుకున్న ప్రచారానికి షాకింగ్ సమాధానం చెప్పిన సుస్మిత
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీతో డేటింగ్‌లో ఉన్నారనే;
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీతో డేటింగ్‌లో ఉన్నారనే వార్త దేశ మీడియాలో సంచలనానికి దారి తీసింది. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతుండటంతో వారిద్దరి పెళ్లి అయిపోయిందంటూ జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. మాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తమకు ఇంకా వివాహం కాలేదని, కానీ త్వరలోనే చేసుకుంటామంటూ ట్వీట్ చేశాడు.
సుష్మితా తన బెటర్ హాఫ్ అన్న లలిత్ మోదీ.. ప్రపంచ టూర్ చేశామని, మాల్దీవులు, సర్దినియా వెళ్లి వచ్చామని చెప్పాడు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని, కేవలం డేటింగ్ చేస్తున్నామని తెలిపాడు. కానీ ఏదో ఒక రోజు తాము పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యంలేదన్న సంకేతాన్ని కూడా లలిత్ మోడీ తన ట్వీట్‌లో వ్యక్తపరిచాడు.
ఈ ట్వీట్లపై శుక్రవారం నాడు సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, కనీసం ఎంగేజ్ మెంట్ కూడా కాలేదని సూటిగా చెప్పేసింది. తాను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని కూడా ఆమె తెలిపింది. ఈ వ్యవహారంపై తాను పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చినట్టుగానే భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఐపీఎల్‌లో మనీల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ.. 2010లో ఇండియా నుంచి పరారీ అయ్యాడు. అయితే అప్పటి నుంచి అతను లండన్‌లోనే ఉంటున్నాడు.