తాప్సి మాట మార్చేసిందిగా

ఇక్కడ కొన్ని సినిమాలు చేసి వెంటనే బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ ఒక హిట్ పడగానే ఇక్కడ సౌత్ మేకర్స్ ని విమర్శించడం, వారిపై సెటైర్లు వేయడం [more]

Update: 2019-10-21 08:18 GMT

ఇక్కడ కొన్ని సినిమాలు చేసి వెంటనే బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ ఒక హిట్ పడగానే ఇక్కడ సౌత్ మేకర్స్ ని విమర్శించడం, వారిపై సెటైర్లు వేయడం ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య మన హీరోయిన్స్ కి. ఇందులో మొదటగా మనకి గుర్తు వచ్చే పేరు తాప్సి. ఈమె అక్కడికి వెళ్లి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సౌత్ లో తనకు అన్యాయం జరిగిందని, సరైన పాత్రలు చేయలేదు అని చెప్పింది.

చెప్పిన మాటలు విని….

లేటెస్ట్ గా తాప్సి ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం స్వరం మార్చేసింది. ” కొందరు చెప్పిన మాటలు విని తెలుగు లో సినిమాల ఎంపికలో తప్పులు చేశాను. నా కెరీర్ స్టార్టింగ్ లో ఎలా నటించాలో, ఎటువంటి సినిమాలు చేయాలో నాకు తెలియలేదు. కొందరు హీరోయిన్స్ నాకు నువ్వు ఈ సినిమా చేయాలి. ఈ పాత్ర చేయాలి అని చెప్పడం తో ఏమి ఆలోచించక అవి చేసేశాను. అవి వేరే హీరోయిన్లకు ఓకే కానీ నాకు అలాంటి సినిమాలు వర్కవుట్ కావని తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు నా సొంత బుర్ర ఉపయోగించి సినిమాలు చేస్తున్నా” అని చెప్పింది తాప్సి. తెలుగు లో తాప్సి ఏ సినిమా చేయడం లేదు.

 

 

Tags:    

Similar News