బన్నీకే దిక్కు లేదు.. ఇప్పుడు చిరు

రంగస్థలం సినిమా వచ్చి అపుడే ఏడాదిన్నర గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కలేదు. మహేష్ తో చెయ్యాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వగానే అల్లు [more]

Update: 2019-10-14 07:18 GMT

రంగస్థలం సినిమా వచ్చి అపుడే ఏడాదిన్నర గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కలేదు. మహేష్ తో చెయ్యాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వగానే అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయిన సుకుమార్. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకపోతున్నాడు. అల్లు అర్జున్ ని స్క్రిప్ట్ తో మెప్పించలేక మీనవేషాలు లెక్కెడుతున్నాడు. అసలైతే ఈ దసరాకి బన్నీ – సుకుమార్ ల సినిమా మొదలవ్వాల్సింది. కానీ ఈ సినిమామాకే దిక్కులేదు. తాజాగా సుకుమార్ మరో సినిమా ఫైనల్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్.

చిరూ సిద్ధమేనా…?

సైరాతో హిట్ అందుకుని కొరటాలతో తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించి చిరంజీవితో సుకుమార్ చిరు 153 చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. రామ్ చరణ్ తో ఉన్న స్నేహంతోనే చిరు సినిమా దర్శకత్వాన్ని సుకుమార్ అందుకోగలిగాడని అంటున్నారు. చిరు – సుకుమార్ ల చిత్రం ఓ మలయాళ రీమేక్ గా తెలుస్తుంది. అది కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ అంటూ ప్రచారం మొదలైంది. మరి బన్నీ చిత్రాన్ని త్వరగా ఫినిష్ చేసి. సుకుమార్ చిరుతో సినిమా మొదలెడతాడట. మరి ఈలోపు చిరు కూడా కొరటాల సినిమా ఫినిష్ చేసి సుకుమార్ కోసం రెడీ
అవుతాడని అంటున్నారు.

 

Tags:    

Similar News