విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సీవాలా సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్, సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ క్రేజ్ ఈ సినిమా కలెక్షన్స్ కి కారణమని చెప్పొచ్చు. విజయ్ క్రేజ్ ప్రేక్షకుల్లో మాములుగా లేదు. విజయ్ నటన... ఈ సినిమా స్క్రీన్ ప్లే, రాహుల్ దర్శకత్వం అన్నీ సినిమాని విజయ తీరాన్ని చేర్చాయి. జర్నలిస్ట్ ఎస్ కే ఎన్ మొదటిసారి నిర్మాతగా మారి నిర్మించిన ఈ సినిమాతో బోలెడన్ని లాభాలను మూటగట్టుకునేలా కనబడుతున్నాడు. ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా చిత్రం శని, ఆదివారాలలోనే అంటే ఫస్ట్ వీకెండ్ కే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల షేర్ సాధించింది. మరి ఈ వారంలో టాక్సీవాలాతో పోటీపడిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాని ప్రేక్షకులు తిరస్కరించడంతో విజయ్ దేవరకొండ పంట పండింది. ఏదయినా విజయ్ మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.
ఏరియా షేర్స్ (కోట్లలో)
నైజాం 2.76
సీడెడ్ 0.80
అర్బన్ ఏరియాస్ 0.76
గుంటూరు 0.53
ఈస్ట్ గోదావరి 0.39
వెస్ట్ గోదావరి 0.35
కృష్ణ 0.52
నెల్లూరు 0.21
ఏపీ అండ్ టీఎస్ 6.32 కోట్లు
ఇతర ప్రాంతాలు 1.05
ఓవర్సీస్ 1.75
వరల్డ్ వైడ్ షేర్స్ 9.12 కోట్లు