ఏప్రిల్ ఆఖరివారంలో ఓటీటీ, థియేటర్లలోకి భారీ చిత్రాలు
నాని ఫుల్ లెంగ్త్ పక్కా మాస్ హీరోగా తెరకెక్కిన దసరా చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 30న..
ప్రతీవారం మాదిరిగానే ఈ వారంకూడా పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. అంతేకాదు ఈ వారం భారీ చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. వాటిలో ఒకటి "ఏజెంట్". ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన అక్కినేని హీరో అఖిల్.. ఇప్పుడు యాక్షన్ లోకి దిగుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్ గా.. అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "ఏజెంట్" సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కాబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ ను ఆదుకున్నా.. ఈ సినిమాపైనే అఖిల్ గంపెడాశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడలేదు. ఈ సినిమాతోనైనా అలాంటి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.
ఇక ఏజెంట్ రిలీజ్ రోజునే.. పొన్నియిన్ సెల్వన్ -2 సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మణిరత్నం కలల సినిమా పొన్నియిన్ సెల్వన్ 1 కి ఇది కంటిన్యూషన్. పార్ట్ 1 లో మిగిలిన ఎన్నోప్రశ్నలకు సమాధానంగా పార్ట్ 2 రాబోతోంది. ఏప్రిల్ 28న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. పార్ట్ 2 లోనూ.. కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష తదితరులు నటించారు.
నందితాశ్వేత హీరోయిన్ గా నటించిన "రారా పెనిమిటి" చిత్రం కూడా ఏప్రిల్ 28నే విడుదల కాబోతోంది. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో.. సింగిల్ క్యారెక్టర్ తో ఈ సినిమాను తీశారు. ప్రమీల నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త రాకకోసం ఎదురుచూస్తూ పడే విరహ వేదనే ఈ సినిమా. కనిపించకుండా వినిపించే పాత్రల్లో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ వాయిస్ అందించారు.
జర్మరీ హెలెండర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ మూవీ శిసు ఏప్రిల్ 28న ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నాని ఫుల్ లెంగ్త్ పక్కా మాస్ హీరోగా తెరకెక్కిన దసరా చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 30న విడుదలైన ఈ సినిమాథియేట్రికల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో నాని.. పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెట్టాడు. ఏప్రిల్ 27 నుండి దసరా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ స్పై థ్రిల్లర్ సిటాడెల్ తెలుగులో తొలి రెండు ఎపిసోడ్లు అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 28 నుండి స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఆ తర్వాత మే నెలలో ఒక్కో వారం ఒక్కో ఎపిసోడ్ ను స్ట్రీమ్ చేయనున్నారు. ఇండియన్ వర్షన్ లో సమంత, వరుణ్ ధావన్ నటిస్తుండగా.. దానికంటే ముందే తెలుగు డబ్ సిటాడెల్ సిరీస్ రానుండటం విశేషం.
ఇప్పుడు అంతా వెబ్ సిరీస్ లకే మొగ్గు చూపుతున్నారు. అందుకే స్టార్ హీరో హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పులి-మేక సిరీస్ తో దూసుకెళ్తున్న జీ 5.. ఇప్పుడు మరో తెలుగు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. అదే వ్యవస్థ. న్యాయవ్యవస్థ నేపథ్యంగా తీసిన ఈ వెబ్ సిరీస్ లో హెబ్బా పటేల్, కేరాఫ్ కంచరపాలెం, నారప్ప ఫేమ్ కారతిక్ రత్నం, సంపత్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, హర్షవర్థన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.