అన్నపూర్ణ స్టూడియోలో... పవన్, బాలకృష్ణ
అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల సందడి నెలకొంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో షూటింగ్ కు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు;
అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల సందడి నెలకొంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో షూటింగ్ కు ఈరోజు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఆహా ఓటీటీలో ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోెస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
అభిమానుల సందడి...
అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ షో షూటింగ్ కు ఈరోజు హాజరవుతున్నారని తెలిసి ఇరువురు అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. ఫ్యాన్స్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోతుంది.