టాలీవుడ్ లో విషాదం.. యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య

సుధాకర్ - సుధీర్ వర్మ కలిసి.. చాందినీ చౌదరి హీరోయిన్ గా కుందనపు బొమ్మ సినిమాలో నటించారు. ఆ సినిమాతో సుధీర్ కు మంచి..;

Update: 2023-01-23 10:53 GMT
kundanapu bomma fame sudheer varma

kundanapu bomma fame sudheer varma

  • whatsapp icon

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో సుధీర్ వర్మ విశాఖపట్నంలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సహనటుడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సుధాకర్ - సుధీర్ వర్మ కలిసి.. చాందినీ చౌదరి హీరోయిన్ గా కుందనపు బొమ్మ సినిమాలో నటించారు. ఆ సినిమాతో సుధీర్ కు మంచి పేరొచ్చింది.

సుధీర్ వర్మ తెలుగులో.. ‘కుందనపు బొమ్మ’, ‘సెకండ్‌ హ్యాండ్‌’, ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ వంటి సినిమాల్లో నటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల సుధీర్ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న నిజాన్ని తాను నమ్మలేకపోతున్నానని.. తనతో మంచి స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటుడు సుధాకర్ కోమాకుల తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. సుధీర్ హఠాన్మరణంపై.. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ.. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.







Tags:    

Similar News