కేజీఎఫ్ 2 నుంచి "తూఫాన్" ఫస్ట్ సాంగ్ రిలీజ్

పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలయ్యే ఈ పాటలో ప్రతి లిరిక్ పవర్ ఫుల్ గా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు రవి బస్రూర్..;

Update: 2022-03-21 07:31 GMT
కేజీఎఫ్ 2 నుంచి "తూఫాన్" ఫస్ట్ సాంగ్ రిలీజ్
  • whatsapp icon

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF Chapter 2 నుండి ఎట్టకేలకు మొదటి పాట విడుదలైంది. "తూఫాన్" అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలయ్యే ఈ పాటలో ప్రతి లిరిక్ పవర్ ఫుల్ గా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా.. సింగర్స్ శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు ఆలపించారు. "తూఫాన్" సాంగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని తెలుస్తోంది.

"తూఫాన్" సాంగ్ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF Chapter 2 సినిమాను హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. యష్ కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా.. రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషించారు.
Full View


Tags:    

Similar News