Breaking :టాలీవుడ్‌లో విషాదం... సినియర్ నటుడు మృతి
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకంది. సీనియర్ నటుడు క్యాస్ట్యూమ్ కృష్ణ మరణించారు;
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకంది. సీనియర్ నటుడు క్యాస్ట్యూమ్ కృష్ణ మరణించారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్యాస్ట్యూమ్ కృష్ణ మరణించారని ఆయన బంధువులు చెప్పారు. క్యాస్ట్యూమ్ కృష్ణ మృతితో టాలివుడ్‌కు చెందిన ప్రముఖులు తమ సంపాదన వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
నటుడిగా నిర్మాతగా...
నటుడిగా, నిర్మాతగా ఆయన అనేక చిత్రాల్లో పనిచేశారు. హిట్ మూవీ పెళ్లిపందిరి ఆయన నిర్మాణంలోనే రూపుదిద్దుకుంది. పలు సినిమాల్లో రాజకీయ నేతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన క్యాస్ట్యూమ్ కృష్ణ విజయనగరం జిల్లా లక్కవరపు కోటకు చెందిన వారు. ఆయన మృతితో టాలివుడ్‌లో విషాదం నెలకొంది. అనేక మంది సీనియర్ నటులకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన తర్వాత నటించడం ప్రారంభించారు.