ఇదేమి ట్విస్ట్ గురు..!

మొన్నటి వరకు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ చెప్పే లైన్స్ కి బన్నీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో తన [more]

;

Update: 2018-12-28 07:16 GMT
allu arjun movie release date
  • whatsapp icon

మొన్నటి వరకు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ చెప్పే లైన్స్ కి బన్నీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో తన మనసు మార్చుకుని ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చిన పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పరశురాం.. బన్నీకి ట్రయాంగులర్ లవ్ స్టోరీ చెపితే బన్నీ దానికి వెంటనే కనెక్ట్ అయ్యి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు. అలా త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చి పరశురాంతో చేయడానికి బన్నీ రెడీ అయ్యాడు. అయితే గత కొంతకాలం నుండి సాయి ధరమ్ తేజ్ కు సరైన హిట్ ఒక్కటి కూడా లేదు.

ఆ అవకాశాన్ని తేజ్ కి వదిలేసిన అర్జున్

ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్ కోసం బన్నీ ఒక అడుగు ముందుకు వేసి తనకంటే ఈ సినిమా తేజ్ కి ఎక్కువ అవసరం అని భావించిన బన్నీ, ఆ సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేయమని పరశురాంతో చెప్పాడట. అందుకే పరశురాం నుండి డ్రాప్ అయ్యి మళ్లీ త్రివిక్రమ్ వైపు వెళ్తున్నాడు బన్నీ. మరి త్రివిక్రమ్ ఏమో చిరంజీవితో ఓ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ మొదట ఎవరితో స్టార్ట్ చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం బన్నీతోనే స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News