నయన్-విఘ్నేశ్ ల సరోగసీ వివాదం అందుకే పెద్దదైంది : వరలక్ష్మీ శరత్ కుమార్
తాజాగా ఈ వివాదం పై ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. తాను సమంతతో కలిసి నటించిన..
నయనతార - విఘ్నేశ్ శివన్ లకు ఇటీవల కవలపిల్లలు పుట్టారన్న విషయం తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే నయనతార పిల్లల్ని కనడం అసాధ్యమంటూ.. సరోగసి వివాదం తెరపైకి వచ్చింది. చాలామంది నయన్, విగ్నేష్ సరోగసి రూల్స్ పాటించలేదని ఆరోపణలు చేశారు. అందాన్ని కాపాడుకోవడం కోసం నయన్ ఇంత పని చేస్తుందా అని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. తమిళనాడు ఆరోగ్యశాఖ ఓ కమిటీ వేసింది. ఇటీవల ఆ కమిటీ విచారణ చేసి.. నయన్ - విఘ్నేశ్ లు అన్ని రూల్స్ పాటించే సరోగసి ద్వారా కవల పిల్లల్ని కన్నారని తేలింది. 6 ఏళ్ల క్రితమే వారికి వివాహమవ్వగా.. పిల్లల కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నారని, చట్టబద్దంగానే నయన్ దంపతులు సరోగాసీని ఆశ్రయించారని కమిటీ వెల్లడించింది.
తాజాగా ఈ వివాదం పై ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. తాను సమంతతో కలిసి నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా కూడా సరోగసి నేపథ్యంలోనే తెరకెక్కింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరోగసి గురించి మాట్లాడుతూ నయనతార వివాదం గురించి కామెంట్స్ చేసింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ.. "యశోద సినిమాలో నేను అద్దె తల్లులని చూసే డాక్టర్ గా నటించాను. కథ విన్నాక బయట ఇలా జరుగుతుందని ఆశ్చర్యపోయాను. అద్దె తల్లి విధానం గురించి ఇటీవల పెద్ద చర్చే జరిగింది. అది బయట మాములుగా జరుగుతూనే ఉంది. అదేమీ వివాదం చేయాల్సిన అంశం కాదు. కానీ అక్కడ ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్ లు సెలబ్రిటీస్ కావడంతో ఆ సరోగసి పెద్ద వివాదంగా మారింది. లేకపోతే ఎవరికీ తెలిసే ఆస్కారమే లేదు" అని పేర్కొంది.