Varun in OperationValentine:మా నాన్న చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావు: వరుణ్ తేజ్
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా;
Varun in OperationValentine:టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న విడుదల కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపధ్యంలో ఈ సినిమా వచ్చింది. ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ పొట్టిగా ఉన్న వాళ్లు పోలీసు అధికారులుగా నటిస్తే సెట్ అవ్వదన్నట్లు చెప్పారు. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి రిస్క్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాడని నాగబాబు అన్నారు. వరుణ్ ఎత్తు, బాడీ లాంగ్వేజ్ ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు కచ్చితంగా ఉంటుందన్నాడు. 5.3 అంగుళాల ఎత్తుండే వ్యక్తి కూడా పోలీసు పాత్రలు చేస్తే చూడటానికి బాగుండదన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. టాలీవుడ్‌లోని కొందరు హీరోల్ని నాగబాబు టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 5.3 అంగుళాల ఎత్తంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోని ఓ అగ్రహీరోను ఉద్దేశించి చేసినవేనని కామెంట్లు పెడుతున్నారు.