Lavanya Tripathi: లావణ్య ముద్దుపేరు ఏంటి..! వరుణ్ తనకి ఎలా ప్రపోజ్ చేశాడు..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ముద్దుపేరు ఏంటో తెలుసా..? వరుణ్ తేజ్ లావణ్యకి ఎలా ప్రపోజ్ చేసారో తెలుసా..?;

Update: 2024-02-11 09:45 GMT
Lavanya Tripathi: మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. మ్యారేజ్ తరువాత కూడా నటిగా కెరీర్ ని కొనసాగితున్నారు. లావణ్య నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో లావణ్య పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ప్రేమ పెళ్లి చేసుకున్న వరుణ్, లావణ్యలో ముందుగా ఎవరు మొదటి ప్రపోజ్ చేశారనే విషయం పై లావణ్య మాట్లాడుతూ.. "ప్రేమ విషయాన్ని ఎవరు చెప్పుకోలేదు. ఒకరికి ఒకరు అర్ధమయ్యి ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాము. అయితే పెళ్లి ప్రపోజల్ ని మాత్రం వరుణ్ ముందుగా చెప్పాడు. ఆ టైంకి నాకు ఆలోచన లేదు. అయితే ఎక్కడో లోపల వరుణ్ తో ఏడడుగులు వేయాలనే ఆలోచన ఉండడంతో వరుణ్ వెంటనే ప్రపోజల్ కి వెంటనే ఓకే చెప్పేసాను" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక అలాగే తనకి ఉన్న ముద్దు పేరు (Nick Name) గురించి లావణ్య మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ‘చున్ చున్’ అని పిలిచేవారు. నా చిన్నప్పుడు టెలివిజన్ లో వచ్చే ఓ రైమ్ లోని పదమే ఆ పేరు. ఆ పేరుతో పిలుపించుకోవడం నాకు కూడా ఇష్టం" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ పేరు విన్న నెటిజెన్స్.. ఇదేంటి 'చిన్ చాన్'లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News