టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు మృతి

సీనియర్ నటుడు బాలయ్య మృతి చెందాడు. యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు.

Update: 2022-04-09 04:52 GMT

సీనియర్ నటుడు బాలయ్య మృతి చెందాడు. యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. బాలయ్య వయసు 94 సంవత్సరాలు. బాలయ్య దాదాపు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి బాలయ్య చిత్ర పరిశ్రమకు సుపరిచితుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించారు.

దిగ్గజ నటులతో...
తండ్రి, విలన్ పాత్రలను కూడా సమర్థవంతంగా పోషించి బాలయ్య ప్రేక్షకుల మదిలో నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటులతో బాలయ్య నటించారు. బాలయ్య మల్లీశ్వరి, అన్నమయ్య, పార్వతీ కల్యాణం, యమలీల, శ్రీరామ రాజ్యం వంటి చిత్రాల్లో నటించారు. బాలయ్య దర్శకుడిగా, రచయితగా కూడా సినీ పరిశ్రమకు సుపరిచితుడు. బాలయ్య మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.


Tags:    

Similar News