మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సర్కార్ హడావిడి ముగిసింది. దీపావళి కానుకగా విడుదలైన సర్కార్ సినిమా కాంట్రవర్సీలతోనే కలెక్షన్స్ సాధించింది. అసలు యావరేజ్ టాక్ కూడా పడని సర్కార్ సినిమాని విజయ్ అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా హిట్ చేసేసారు. సినిమా పోయింది అనుకున్న టైంలో సర్కార్ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అలా సర్కార్ యావరేజ్, నెగెటివ్ టాక్ తోనే సూపర్ హిట్ కలెక్షస్స్ సాధించింది. ఇక తాజాగా విజయ్ మెర్సెల్ కాంబోని తెర మీదకి తెచ్చాడు. మెర్సెల్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో విజయ్ కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది.
నయనతార కోచ్ గా...
ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న విజయ్ #63 అతి త్వరలోనే మొదలవ్వబోతుంది. విజయ్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని... అయితే ఈ సినిమా లో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా వచ్చే దీపావళి టార్గెట్ గానే తెరకెక్కుతుంది. మరి సర్కార్ తో రికార్డులు క్రియేట్ చేసిన విజయ్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీతోనూ సంచలనాలు నమోదు చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.