రెండు నిమిషాల లిప్ కిస్ పెట్టాడ‌ట‌..!

నటుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలంటే అతని సినిమాల్లో మనకు ముందుగా గుర్తు వచ్చేది లిప్ లాక్స్. అర్జున్ రెడ్డి సినిమాలో మనోడు లిప్ కిస్ పెట్టే [more]

;

Update: 2019-05-09 08:03 GMT

నటుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలంటే అతని సినిమాల్లో మనకు ముందుగా గుర్తు వచ్చేది లిప్ లాక్స్. అర్జున్ రెడ్డి సినిమాలో మనోడు లిప్ కిస్ పెట్టే సీన్స్ టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇక అప్పటి నుండి టాలీవుడ్ లో లిప్ లాక్ లేని సినిమాలు రావడం లేదు. అందుకే మనోడికి టాలీవుడ్ ఇమ్రాన్ హాష్మి అనే పేరు కూడా ఉంది. దీంతో విజయ్ సినిమాల్లో లిప్పు లాకులు కామన్ అయిపోయాయి. విజయ్ లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’లో రష్మికతో లిప్ లాక్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. అలానే విజయ్ మరో కొత్త మూవీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

రెండు నిమిషాల లిప్ కిస్

ఇందులో కూడా లిప్ లాక్ ఉందట. ఇందులో పెద్ద విషయం ఏముంది విజయ్ సినిమాల్లో ఇవి ఇప్పుడు కామన్ అయిపోయాయి కదా అంటారా? అయితే ఈసారి విజయ్ లిప్ కిస్సుల్లో కూడా కొత్తదనం చూపించనున్నాడట. ఈ సినిమాలో ఏకంగా రెండు నిముషాల పాటూ సా…గే సుదీర్ఘమైన లిప్ కిస్ పెట్టారట. ఈ కిస్ ఎంతో కళాత్మకంగా.. ఆడియన్స్ కు అర్జున్ రెడ్డిని గుర్తుకు తెచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే మరి ఆ లిప్ లాక్ ను అందుకున్న ఆ అమ్మడు ఎవరో మాత్రం తెలియదు. ఇందులో రాశి ఖన్నాతో మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్ ఉంది. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనేది క్లారిటీ లేదు.

Tags:    

Similar News