అప్పటి నుంచే మహేష్ గారికి అభిమానిని..!

‘‘నేను ఇంటర్మీడియట్‌ నుండి మహేష్‌బాబు గారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయన్ని సార్‌! అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేం కాలేజ్‌లో ఉన్నప్పుడు మావాడు అని [more]

Update: 2019-05-02 06:28 GMT

‘‘నేను ఇంటర్మీడియట్‌ నుండి మహేష్‌బాబు గారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయన్ని సార్‌! అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేం కాలేజ్‌లో ఉన్నప్పుడు మావాడు అని అనుకుంటుండే. ఆయన 25వ సినిమా. ఇదొక జర్నీ. జర్నీ ఆఫ్‌ రిషి.. జర్నీ ఆఫ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు. ఒక్కొక్క జర్నీకి ఒక్కొక్క సూపర్‌స్టార్‌ ఉండేవాళ్లు. ఓ జనరేషన్‌కి చిరు సార్‌ ఉండేవాళ్లు. కోణార్క్‌ లో మహేష్‌ బాబు సినిమాలు చూడాలనుకునేవాడిని. కానీ మాస్‌ ఫ్యాన్స్‌ కారణంగా టిక్కెట్స్‌ దొరికేవీ కావు. చివరకు లేడీస్‌ క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్‌ సమయంలో నా కజిన్స్‌ ని పట్టుకుని టికెట్స్‌ తెప్పించుకునేవాడిని. అలా యాక్టర్‌ అయిన తర్వాత ఓ అవార్డ్‌ ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడకు మహేష్‌ గారు రాగానే ఆయన్ను అందరూ విష్‌ చేయడం చూసి అరె! లైఫ్‌ అంటే అలా ఉండ్రాలా అనుకున్నాను.’’ అంటూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన మహర్షి ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు.

మహేష్ ఫ్యాన్ గా ఎదురుచూస్తున్నా…

‘‘తర్వాత నేను ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలు చేశాను. వాటిని చూసి మహేష్‌ గారు ట్వీట్‌ చేసేవారు. నా ఫోన్‌లో ట్విట్టర్‌ వాట్సాప్‌ ఉండవు కానీ ఎవరో చెబితే వెళ్లి వెతుక్కునేవాడిని. నా గురించి ఆయన ఏదైనా గొప్పగా చెబితే సంతోషంగా అనిపించేది. ఆయన్ని గర్వంగా ఉంచడానికి కంటిన్యూగా సినిమాలు చేస్తాను. నా గురించి ట్వీట్స్‌ చేసేలా చూసుకుంటాను. నా పుట్టినరోజునే ఈ సినిమా విడుదలవుతుంది. ఓ రకంగా నాకు కూడా ప్రెషర్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలి. వంశీ అన్న నాకు గైడెన్స్‌ ఇస్తుంటారు. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. మే 9న ఓ సూపర్‌హిట్‌ చూడాలని ఓ ఫ్యాన్‌గా, ఓ యాక్టర్‌గా ఎదురుచూస్తున్నాను.’’ అని విజయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News