విజయ్ సినిమా పోకిరీలా ఉండబోతుందా?
విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ రేంజ్ కి చేరుకున్న హీరో. టాలీవుడ్ లోనే కాదు.. విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో [more]
;
విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ రేంజ్ కి చేరుకున్న హీరో. టాలీవుడ్ లోనే కాదు.. విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో [more]
విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ రేంజ్ కి చేరుకున్న హీరో. టాలీవుడ్ లోనే కాదు.. విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో కూడా భీబత్సం. అందుకే విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ కి ఓ సినిమా చేస్తున్నాడు. అయితే పూరి అంటే తనకి ఎప్పటినుండో చాలా ఇష్టమంటున్నాడు. పూరి మేకింగ్ స్టయిల్ కి తానెప్పుడూ అభిమానినే అంటున్న విజయ్ మహేష్ బాబు తో పూరి చేసిన పోకిరి అంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే పూరి జగన్నాధ్ తో ఓ మంచి కమర్షియల్ మూవీ చెయ్యాలని ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీ చేస్తునట్టుగా చెప్పాడు విజయ్ దేవరకొండ.
పోకిరి లాంటి కమర్షియల్ సినిమా ఇప్పటివరకు చెయ్యలేదని అందుకే ఆ సినిమా నా ఫెవెరెట్ అంటున్నాడు విజయ్. మరి విజయ్ దేవరకొండ కి పూరి జగన్నాధ్ ఫైటర్ సినిమా కథని కమర్షియల్ రేంజ్ లో ప్రిపేర్ చేసి ఒప్పించాడేమో అందుకే.. విజయ్ దేవరకొండ అలాంటి కథతో పాన్ ఇండియా లెవల్లో సినిమా తీస్తే హిట్ అవుతాది అని పూరీని ఒప్పించి ఉంటాడు. ఇక పూరి తో చెయ్యబోయే సినిమా కోసం ఎనిమిది నెలలు కష్టపడి వరౌట్స్ చేస్తున్నా అని.. ఈ సినిమా కోసం తాను సిక్స్ ప్యాక్ కానీ.. ఎయిట్ ప్యాక్ లో కనిపిస్తా అని చెబుతున్నాడు. అంతేకాదు అన్ని రెగ్యులర్ కమర్షిల్ మూవీస్ లాగే మాస్ స్టయిల్ కమర్షియల్ లో ఉంటుందని చెబుతున్న విజయ్ ని చూస్తే పోకిరి లాంటి కథ కావడం వలెనే విజయ్ పూరి కి కనెక్ట్ అయ్యాడనిపిస్తుంది.