అందుకే పుష్ప నుండి తప్పుకున్నా?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే పుష్ప సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ కేరెక్టర్ అని, కాదు ఓ పెద్ద పోలీస్ [more]

Update: 2020-07-14 09:59 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే పుష్ప సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ కేరెక్టర్ అని, కాదు ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ గా పుష్ప లో విజయ్ సేతుపతి కేరెక్టర్ ఉండబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. అసలు విజయ్ సేతుపతి పుష్ప సినిమాలో ఉన్నాడో లేదో క్లారిటీ లేదు.. కానీ మధ్యలో పారితోషకం భారీగా అడగడంతో పుష్ప నుండి సుకుమార్ – మైత్రి వారు విజయ్ సేతుపతిని తప్పించారని టాక్ నడవడం, విజయ్ సేతుపతి రోల్ నచ్చక , కాదు పారితోషకం సరిపోకే పుష్ప నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడని అన్నారు. ఇ=ప్పటికే టాలీవుడ్ ఉప్పెన సినిమాకి విజయ్ సేతుపతి 7 కోట్లు తీసుకుంటున్నాడు. మరి అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ కాబట్టి విజయ్ సేతుపతి భారీగా అడగబట్టే పుష్ప నుండి విజయ్ సేతుపతిని తప్పించారంటూ ప్రచారం జరుగుతూఉంది.

అయితే తాజాగా విజయ్ సేతుపతి ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పుష్ప నుండి ఎందుకు తప్పుకున్నాడో క్లారిటీ ఇచ్చాడు. అవును నేను పుష్ప సినిమాలో నటించడం లేదు. నాకు పుష్ప సినిమాలో చాలామంచి రోల్ వచ్చింది. కానీ కేవ‌లం కాల్షీట్ల స‌మ‌స్య‌తోనే ఈ సినిమా నుంచి తాను త‌ప్పుకున్నాన‌ని… నేను సుకుమార్‌గారిని వ్యక్తిగతంగా కలిసి నా కాల్ షీట్స్ సమస్య గురించి చెప్పడమే కాదు.. డేట్స్ అడ్జెస్ట్ కారణంగా పుష్ప సినిమాని ఇబ్బందుల్లో నెట్టలేకే నేను పుష్ప నుండి తప్పుకున్నాను అని వివరించానని చెబుతున్నాడు. అంతేకాని పారితోషకం సమస్య కానేకాదు…. పుష్ప కథ, కథలోని నా పాత్ర బాగా నచ్చింది కానీ… పుష్ప కన్నా ముందు ఒప్పుకున్నా సినిమాలకు డేట్స్ కుదరకే ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.. అంటూ పుష్ప నుండి బయటికివెళ్ళినందుకు బాగా ఫీలవుతున్నాడు కూడా విజయ్ సేతుపతి.

Tags:    

Similar News