నిన్న ఉప్పెన.. నేడు ఈ బయోపిక్

విజయ్ సేతుపతి క్రేజ్ ఈ మధ్యన స్టార్ హీరోలతో సమానంగా కనిపిస్తుంది. చిన్న పెద్ద సినిమాలంటూ చూడడమే కాదు…. హీరో పాత్రలే కాదు… సినిమాలో కీలకమైన పాత్ర [more]

Update: 2019-08-09 07:21 GMT

విజయ్ సేతుపతి క్రేజ్ ఈ మధ్యన స్టార్ హీరోలతో సమానంగా కనిపిస్తుంది. చిన్న పెద్ద సినిమాలంటూ చూడడమే కాదు…. హీరో పాత్రలే కాదు… సినిమాలో కీలకమైన పాత్ర ఏది దొరికిన విజయ్ సేతుపతి వదలడం లేదు. నటుడిగా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్న విజయ్ సేతుపతి… తెలుగులో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి విలన్ రోల్ అంటే ఆ సినిమాకి మాములుగా క్రేజ్ ఉండదు. అయితే కొన్ని రోజులనుండి విజయ్ సేతుపతి, వైష్ణవ తేజ్ ఉప్పెన నుండి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

బయోపిక్ నుంచి కూడా….

తాజాగా విజయ్ సేతుపతి మరో మూవీ నుండి తప్పుకున్నాడనే ప్రచారం మొదలైంది. అది కూడా ఓ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ నుండి అంటున్నారు. విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక లెజెండరి క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయో పిక్ ని టాలీవుడ్ హీరో రానా తో పాటు కోలీవుడ్ నిర్మాతలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎపుడో సినిమా మీద అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ముహూర్తం పెట్టుకోకున్న ఈ మూవీ నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లుగా సమాచారం. అయన క్రేజ్ కి ఈ సినిమా చేస్తే బావుండేదని విజయ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారట. అంతేకాకుండా హీరో రానా కూడా ఈ సినిమా బడ్జెట్ పరిమితికి మించి ఉండడంతో రానా కూడా పునరాలోచనలో పడినట్లుగా టాక్. మరి సచిన్ లాంటి క్రికెటర్ గెస్ట్ రోల్ అంటే ఆ సినిమా రేంజ్ ఓ రేంజ్ లో ఉండాలి అంటే అధిక బడ్జెట్ కంపల్సరీ. మరి అటు విజయ్, ఇటు రానా కూడా ఆలోచనలో పడుతున్నారంటే.. అసలా సినిమా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    

Similar News