షాహిద్ కన్నా విజయ్ సేతుపతికే ఎక్కువ!

హీరోగా, విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ ఏ పాత్రకైనా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటుడు విజయ్ సేతుపతి. హీరోగానూ, విలన్ గా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ [more]

Update: 2021-02-04 10:34 GMT

హీరోగా, విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ ఏ పాత్రకైనా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటుడు విజయ్ సేతుపతి. హీరోగానూ, విలన్ గా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తెగ దున్నేస్తున్న విజయ్ సేతుపతి సినిమాలో ఉన్నాడంటే ఆ సినిమాపై క్రేజ్ పెరగడం ఖాయం. అంతలాంటి పాపులారిటీ విజయ్ సేతుపతికి ఉంది. అందుకే విజయ్ సేతుపతి అడిగిన పారితోషకం అడిగింది అడిగినట్లు ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. హీరోగా అదరగొట్టేసున్న విజయ్ సేతుపతి రీసెంట్ గా విలన్ గాను మాస్టర్ సినిమాలో లో చెలరేగిపోయాడు. మాస్టర్ ప్లాప్ అయినా.. విజయ్ విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులనుండి ప్రశంశలు అందుకుంటున్న విజయ్ సేతుపతి ఓ సినిమాలో నటించాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.
విజయ్ సేతుపతి డిమాండ్ చెయ్యడం కాదు.. విజయ్ డిమాండ్ అలా ఉంది. ఉప్పెన సినిమాలో విలన్ కేరెక్టర్ కే 7 కోట్లు అందుకున్న విజయ్.. తమిళంలో మాస్టర్ లో విలన్ గా నటించినందుకు భారీగా ముట్టజెప్పారట నిర్మాతలు. ఇక విజయ్ సేతుపతి తాజా రెమ్యునరేషన్ చూస్తే ఇకపై విజయ్ సేతుపతి తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఓ బాలీవుడ్ వెబ్ సీరీస్ లో నటించేందుకు విజయ్ సేతుపతి ఒప్పందం చేసుకున్నాడు. ఆ సీరీస్ కోసం విజయ్ సేతుపతి ఏకంగా 55 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నాడట. అందులో హీరోగా నటిస్తున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కి 40 కోట్లే. కానీ కోలీవుడ్ నటుడు విజయ్ కి 55 కోట్లు. అంటే ఇక్కడ విజయ్ కేరెక్టర్ కి ఎంత వెయిట్ ఉందో? అలాగే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో? అర్ధమవుతుంది. ఇకపై విజయ్ సేతుపతి కావాలంటే కోట్లు పట్టుకుని కూర్చోవాల్సిందే.

Tags:    

Similar News