ఆ బాలీవుడ్ నటుడు చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన కుటుంబం

విక్రమ్ గోఖలే బతికే ఉన్నారు కానీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై..;

Update: 2022-11-24 02:54 GMT
vikram gokhale death news, gokhale family

vikram gokhale

  • whatsapp icon

బాలీవుడ్ సీనియర్ నటుడు, మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్, ప్రముఖ టీవీ నటుడు అయిన విక్రమ్ గోఖల్ (77) మరణించారంటూ..గురువారం తెల్లవారుజాము నుండీ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులైన అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్ ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ వంటి వారు కూడా ఇదే ట్వీట్లు చేయడంతో.. ఈ వార్తలకు బలం చేకూరింది. ఆయన చనిపోయారని భావిస్తూ నెటిజన్లు సైతం RIP అని పోస్టులు పెడుతున్నారు. దాంతో గోఖలే కుటుంబ సభ్యులు స్పందించారు.

విక్రమ్ గోఖలే బతికే ఉన్నారు కానీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని గోఖలే కుమార్తె కోరారు. కానీ.. ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నరన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ 'హమ్ దిల్‌దే చుకే సనమ్ (1999), కమల హాసన్ సినిమా 'హే రామ్', 'భూల్ భులైయా' (2007), 'దే దనాదన్ (2009) వంటి సూపర్ హిట్ సినిమాల్లో విక్రమ్ గోఖలే నటించారు. 2010లో డైరెక్టర్ గా.. ఆఘాత్ సినిమా తీశారు. మరాఠీ సినిమా 'అనుమతి'లో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. అలాగే 2011లో థియేటర్ నటనకు సంగీతా నాటక్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జూన్‌ లో విడుదలైన 'నికామా' సినిమాలో విక్రమ్ గోఖలే చివరిసారి కనిపించారు.



Tags:    

Similar News