ఒక్క యాక్షన్ సీన్ సినిమాని నిలబెడుతుందట

మాస్ ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చెయ్యగల దర్శకుడు బోయపాటి అనే విషయం తెలిసిందే. దాదాపుగా స్టార్ హీరోలంటే మహెష్ బాబు ని తప్పించి అందరి హీరోలతోనూ సినిమాలు [more]

;

Update: 2019-01-06 03:49 GMT

మాస్ ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చెయ్యగల దర్శకుడు బోయపాటి అనే విషయం తెలిసిందే. దాదాపుగా స్టార్ హీరోలంటే మహెష్ బాబు ని తప్పించి అందరి హీరోలతోనూ సినిమాలు చేసిన బోయపాటి ఒక్క బాలకృష్ణ కి తప్ప ఎవ్వరికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వలేకపోయాడు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాకి క్రిటిక్స్ నుండి మంచి మార్కులు పడకపోయినా… ప్రేక్షకులు మాత్రం గొప్పగా ఆదరించి హిట్ చేశారు. తాజాగా బోయపాటి… రామ్ చరణ్ తో వినయ విధేయరామ సినిమాని పక్కా మాస్ మాసాలతో తెరకెక్కించాడు. రేపు శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతున్న వినయ విధేయరామ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే బోయపాటి మార్క్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సినిమాలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఆ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అనేలా ఉంటాయని ఎప్పటినుండో ప్రచారం లో ఉంది. తాజాగా వినయ విధేయరామ లో ఓ అరగంట సేపు వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని.. విలన్ వివేక్ ఒబెరాయ్ కి రామ్ చరణ్ కి మధ్య అజర్ బైజాన్ దేశంలో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుందట. ఇక అజర్ బైజాన్ లో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ ని భారీ క్రేన్లు .. డ్రోన్లు .. అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి బోయపాటి చిత్రీకరించాడని అంటున్నారు.

మరి ఇంతవరకు బోయపాటి సినిమాల్లో చూడని యాక్షన్ సీక్వెన్సెస్ వినయ విధేయరంలో చూడబోతున్నామని చెబుతున్నారు. మరి మెగా అభిమానులతో పాటుగా మాస్ ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఈ సినిమా విడుదల కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి జనవరి 11 న బాక్సాఫీసు వద్ద ఎన్టీఆర్ బయోపిక్, ఎఫ్ టు, పెటా సినిమాల్తో పోటీపడుతోంది. మరి ఈ సినిమాల మీద వినయ విధేయరామ ఎంతవరకు గెలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News