రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న విషయం స్వయానా చిత్ర బృందమే ప్రెస్ నోట్ తో పాటు రామ్ చరణ్ ట్రెడిషనల్ లుక్ ని కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేసింది. అసలు వినయ విధేయ రామ టైటిల్ తో పాటుగా రామ్ చరణ్ ఈ ట్రెడిషనల్ పంచెకట్టు లుక్ ని వదులుదామనుకున్నారు. కానీ మీడియాకి ముందే ట్రెడిషనల్ లుక్ విషయం లీక్ కావడంతో బోయపాటి మళ్లీ సడన్ గా ఫస్ట్ లుక్ ని మాస్ గా మర్చేసాడు. అప్పట్లో రామ్ చరణ్ మాస్ లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలింది చిత్ర బృందం.
ఇన్ని రకాలుగా క్లారిటీ ఇచ్చినా...
అయితే తాజాగా వదిలిన రామ్ చరణ్ లుక్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో ఉందని మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి లుక్ తో పాటుగా వదిలిన ప్రెస్ నోట్ లో వినయ విధేయ రామ సంక్రాంతికే రిలీజ్ అని మళ్లీ స్పష్టతనిచ్చారు. కానీ సోషల్ మీడియాలో రామ్ చరణ్ వినయ విధేయ రామ జనవరిలో సంక్రాంతికి రావడం లేదని... కొన్ని కారణాలతో ఆ సినిమా వాయిదా పడుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ తోపాటుగా చిత్ర బృందం ఎంతగా వినయ విధేయ రామ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇలాంటి పుకార్లు ఎందుకు పుడుతున్నాయి మాత్రం తెలియడం లేదు.
పుకార్లకు చెక్ పెట్టినా...
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినయ విధేయ రామ విడుదల డేట్ పోస్ట్ పోన్ అవుతుందంటున్న పుకార్లకు ఆ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చాడు. మొదటి నుండి చెబుతున్నట్లుగానే మా వినయ విధేయ రామ సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన ఏ విషయంలోనూ ఆలస్యమనేది జరగడం లేదు. అయితే వినయ విధేయ రామ రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మా సినిమా సంక్రాంతికి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఈ సినిమా విడుదల తేదీపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు.