నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కి అక్కడ ఎంత మంచి పేరుందో అదే స్థాయిలో శత్రువులు కూడా తయారయ్యారు. ముఖ్యంగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న నిర్మాతల మండలిలో వర్గ పోరు తారస్థాయికి చేరి విశాల్ ను టార్గెట్ చేశారు. ఇందుకు సినిమాల విడుదలలో పోటీ తోడయ్యింది. ఈ నెల 21న తమిళంలో ఒకేరోజు ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే, ఇన్ని సినిమాలు ఒకేరోజు విడుదలైతే చిన్న సినిమాలు, చిన్న సినిమాల నిర్మాతలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు చెన్నై టీనగర్ లోని నిర్మాతల మండలి కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. వీరికి విశాల్ వ్యతిరేకవర్గం కూడా తోడయ్యింది. అసలు, ఒకేరోజు 9 సినిమాల విడుదలకు ఎలా అనుమతించారని విశాల్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.