ఓ వార్ ఎపిసోడ్ కోసం అంత ఖర్చా

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ [more]

Update: 2019-09-24 11:48 GMT

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు. అందుకే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అభిమానుల మధ్య జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఆ సీన్ కు రూ.75కోట్లు

ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా రాజీ పడలేదు అని బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఖర్చు పెట్టారని ఆయన చెప్పారు. దర్శకుడి కోరిక మేరకు కోటలు, ప్యాలెస్ లు, సెట్టింగ్స్ మరియు వార్ ఎపిసోడ్స్ కొరకు భారీగా ఖర్చు చేశారని చెప్పారు. సినిమాలో ఒక వార్ ఎపిసోడ్ కోసం జార్జియా దేశంలో ఒకటిన్నర నెలకు పైగా చిత్రీకరించాము. దాని ఖర్చు అక్షరాలా 75 కోట్లు అయిందని ఆయన స్టేజి మీద చెప్పడం జరిగింది. ఈ లెక్కన సినిమా కి 250 కోట్లు అవ్వవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. ఇక ఈ చిత్రంలో చిరుతో పాటు అమితాబ్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా వంటి స్టార్స్ నటించారు. అక్టోబర్ 2 న ఈ మూవీ రిలీజ్ కానుంది.

 

Tags:    

Similar News