మ్యాడ్ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ-డ్రామా MAD;

Update: 2024-03-04 15:25 GMT

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ-డ్రామా MAD. 2023లో మంచి సక్సెస్ సాధించిన సినిమాల్లో ఇదీ ఒకటి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. MAD సినిమా భారీ విజయంతో.. MAD సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. మ్యాడ్ సినిమాలో నటించిన ప్రధాన తారాగణం ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈసారి మొదటి భాగానికి మించి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని అంటున్నారు. మ్యాడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా వర్కౌట్ అయింది.. OTT విడుదల తర్వాత, ఇది విస్తృతమైన రీచ్ సాధించింది.

MAD సినిమా సీక్వెల్‌కి 'MAD Max' అనే పేరు పెట్టారు. ఈ నెలాఖరులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌లో సంగీత్ శోభన్, రామ్ నితిన్, నితిన్ నార్నేల త్రయం ఉండనుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) అనే ముగ్గురు స్నేహితుల కథతో సినిమా మొదటి భాగం సాగుతుంది. మంచి కాలేజీ ఎంటర్టైనర్ గా నిలిచింది.


Tags:    

Similar News