వరల్డ్ ఆఫ్ శబరి.. వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త సినిమా టీజర్
కీలక పాత్రలతో పాటు.. ప్రతినాయక పాత్రలతో అలరిస్తోంది. ఈ సంక్రాంతికి రాబోతున్న వీరసింహారెడ్డిలోనూ ప్రతినాయికగా..;

varalakshmi sarath kumar
వరలక్ష్మి శరత్ కుమార్.. వరుస నెగిటివ్ రోల్స్ తో తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కీలక పాత్రలతో పాటు.. ప్రతినాయక పాత్రలతో అలరిస్తోంది. ఈ సంక్రాంతికి రాబోతున్న వీరసింహారెడ్డిలోనూ ప్రతినాయికగా కనిపించబోతోంది. నోటా, సర్కార్, మారి 2, నాంది, క్రాక్, తెనాలి రామకృష్ణ, పక్కా కమర్షియల్, యశోద ఇలా పలు సినిమాల్లో నటించి.. తెలుగునాట మంచి గుర్తింపు పొందింది. తాజాగా.. లేడీ ఓరియంటెడ్ మూవీలో ప్రధాన పాత్రలో 'శబరి' గా వచ్చేందుకు రెడీ అవుతోంది.
'శబరి' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేంద్రనాథ్ నిర్మించాడు. తాజాగా 'శబరి'కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో చిన్న టీజర్ ను వదిలారు. అందులో.. 'శబరి' ఒక పాపతో ఒంటరిగా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఓ రాత్రి అగంతకుడు ఇంట్లోకి వస్తాడు. అతడి నుండి 'శబరి' పాపను ఎలా కాపాడుకుంది ? ఇంతకీ అతనెవరు ? 'శబరి' ఎందుకు ఒంటరిగా ఉంటుంది ? అన్న సందేహాలతో వీడియోను కట్ చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానుంది.