పిల్లలతో టైం గడిపిన అఖిల్!
దాదాపు ఏడు నెలలు గ్యాప్ తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. తన నాలుగోవ చిత్రం షూటింగ్ కోసం వచ్చాడు. ఈసినిమాను మొదటి సినిమాతోనే [more]
దాదాపు ఏడు నెలలు గ్యాప్ తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. తన నాలుగోవ చిత్రం షూటింగ్ కోసం వచ్చాడు. ఈసినిమాను మొదటి సినిమాతోనే [more]
దాదాపు ఏడు నెలలు గ్యాప్ తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. తన నాలుగోవ చిత్రం షూటింగ్ కోసం వచ్చాడు. ఈసినిమాను మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ కూడా రామ్ తో ‘ఒంగోలుగిత్త’ తరువాత ఏ సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని అఖిల్ చేస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా…
ఇక ఈమూవీ ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించనున్నారు. ఈమూవీ కూడా గీత గోవిందం లాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ అంట. ఇందులో అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. నిన్న షూటింగ్ నేపథ్యంలో చాలా మంది పిల్లలను లొకేషన్ కు తీసుకు వచ్చారు. వారితో అఖిల్ కొంచం సేపు టైం గడిపారు.
హీరోయిన్ ఎవరనేది…?
ప్రస్తుతం ఈషూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పదిరోజులపాటు సాగుతుందట. దీని తరువాత ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట టీమ్. సినిమా అయితే స్టార్ట్ అయింది కానీ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు యూనిట్.