అనుపమకి ఓటేసిన యంగ్ హీరో..?

తమిళంలో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమాని తెలుగులో బెల్లకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో [more]

Update: 2019-02-23 06:39 GMT

తమిళంలో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమాని తెలుగులో బెల్లకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్న ఈ రీమేక్ పూజ కార్యక్రమాలతో మొదలైంది. తమిళనాట ఈ సినిమా సంచలనాలు నమోదు చెయ్యడమే కాదు… మంచి కలెక్షన్స్ రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తమిళులు హిట్ చేశారు. తమిళంలో రచ్చసన్ సినిమాలో హీరోయిన్ గా అమల పాల్ యాక్ట్ చేసింది. ఆ సినిమాలో అమల పాల్ ఒక స్కూల్ టీచర్ గా కనబడుతుంది. అయితే తెలుగులో అమల పాల్ క్యారెక్టర్ లో ముందుగా రకుల్ ప్రీత్ ని అనుకోగా… తర్వాత రకుల్ ప్లేస్ లోకి రాశి ఖన్నా వచ్చి చేరింది. రకుల్ పారితోషకం ఎక్కువగా డిమాండ్ చెయ్యడంతో రాశి ఖన్నానే హీరోయిన్ గా ఫైనల్ చేశారన్నారు.

అనుమపనే ఫైనల్…

కానీ తాజాగా రాశి ఖన్నా ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరిందంటున్నారు. గత ఏడాది వరుస ఫ్లాప్స్ తో అస్సలు క్రేజ్ లేకుండా పోయిన అనుపమ పరమేశ్వరన్ ని రచ్చసన్ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఫైనల్ చేశారనే టాక్ మొదలైంది. ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు వరసగా ఫ్లాప్ అవడంతో.. అమ్మడు కన్నడకి చెక్కేసింది. కన్నడలో ప్రస్తుతం డెబ్యూ మూవీలో నటిస్తుండగా.. తెలుగులో మాత్రం హలో గురు ప్రేమ కోసమే తరువాత ప్రస్తుతం అనుపమా బెల్లంకొండ సినిమాకి మాత్రమే సైన్ చేసిందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే అనుపమ ఈ సినిమాకి సైన్ చేస్తే ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఇదే అవుతుంది.

Tags:    

Similar News